ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రులు/ప్రముఖులు పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. స్టేట్ హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అవసరమైన ఏర్పాట్లపై ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇక 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు/ప్రముఖులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
ఆగస్టు 15న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే:
- ఆదిలాబాద్ – ప్రభుత్వ విప్ గంప గోవర్దన్
- భద్రాద్రి కొత్తగూడెం – ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
- జగిత్యాల – మంత్రి కొప్పుల ఈశ్వర్
- జయశంకర్ భూపాలపల్లి – ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు
- జనగాం – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- జోగులాంబ గద్వాల – ప్రభుత్వ విప్ కే.దామోదర్ రెడ్డి
- కామారెడ్డి – అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
- ఖమ్మం – మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- కరీంనగర్ – మంత్రి గంగుల కమలాకర్
- కుమురంభీం ఆసిఫాబాద్ – ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
- మహబూబ్నగర్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్
- మహబూబాబాద్ – మంత్రి సత్యవతి రాథోడ్
- మంచిర్యాల – ప్రభుత్వ విప్ బాల్క సుమన్
- మెదక్ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- మేడ్చల్ మల్కాజిగిరి – మంత్రి మల్లారెడ్డి
- ములుగు – ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు
- నాగర్ కర్నూల్ – ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
- నల్గొండ – మంత్రి మహమూద్ అలీ
- నారాయణపేట – ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ (రిటైర్డ్ ఐపీఎస్)
- నిర్మల్ – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- నిజామాబాద్ – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- పెద్దపల్లి – ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి (రిటైర్డ్ ఐఏఎస్)
- రాజన్న సిరిసిల్ల – మంత్రి కేటీఆర్
- రంగారెడ్డి – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- సంగారెడ్డి – శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి
- సిద్దిపేట – మంత్రి హరీశ్ రావు
- సూర్యాపేట – మంత్రి జగదీష్ రెడ్డి
- వికారాబాద్ – అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- వనపర్తి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- వరంగల్ – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
- హన్మకొండ – ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
- యాదాద్రి భువనగిరి – ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ