బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

2021 Buddha Purnima, Buddha Jayanti, Buddha Purnima, Buddha Purnima 2021, Buddha Purnima Whishes, CM KCR Greets People in the State on the Occasion of Buddha Purnima, CM KCR greets people on Buddha Jayanti, eve of Buddha Purnima, KCR Greets People in the State on the Occasion of Buddha Purnima, Mango News, National News Update, Occasion of Buddha Purnima, Path shown by Buddha is still relevant, Telangana CM KCR

గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతి కోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీమయన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి సహనం తో కూడిన అహింసాయుత జీవన విధానం, వీటిలోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయని సీఎం వివరించారు. ఫణిగిరి వంటి నాటి బౌద్దారామాల్లో బయటపడుతున్న అరుదైన బౌద్ద చారిత్రక సంపద, గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలను అల్లుకొని తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని సీఎం తెలిపారు.

నాగార్జునసాగర్ లో ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధకేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదని అన్నారు. రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుజ్జీవింప చేసి ప్రపంచ బౌద్దపటంలో తెలంగాణకు సముచితస్థానాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు. ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడడం ద్వారా మాత్రమే భగవాన్ గౌతమబుద్ధునికి నిజమైన నివాళి అర్పించగలుగుతామని, తెలంగాణ ప్రభుత్వం అదే దిశగా ముందుకు సాగుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =