తెలంగాణ రాష్ట్రంలో జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ల్యాబోరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అనుమతించింది. అలాగే ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్ష ధరను రూ.2,200 గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐసీఎంఆర్ ఆమోదించిన 12 ప్రైవేట్ ల్యాబ్స్ ఇకపై కరోనా పరీక్షలను నిర్వహించనున్నాయి.
తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ల్యాబ్స్ జాబితా:
- అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్ -జూబ్లీహిల్స్
- టెనెట్ డయాగ్నోస్టిక్స్ – బంజారాహిల్స్
- స్టార్ హాస్పిటల్స్ – బంజారాహిల్స్
- డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్ – పంజాగుట్ట
- విజయ డయాగ్నొస్టిక్ సెంటర్ – హిమాయత్ నగర్
- యశోదా హాస్పిటల్ ల్యాబ్ – సికింద్రాబాద్
- అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ – బోయినపల్లి
- మెడ్ సిస్ పాత్ ల్యాబ్స్ – న్యూబోయినపల్లి
- బయోగ్నోసిస్ టెక్నాలజీస్ -మేడ్చల్
- పాత్‌కేర్ ల్యాబ్స్ – మేడ్చల్
- అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్ – శేరిలింగంపల్లి
- విమ్తా ల్యాబ్స్ – చెర్లపల్లి
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu