మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు : నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్ ఇదే…

MAA Elections: Actor Prakash Raj Announced his Panel Today

తెలుగు సినీపరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలను అక్టోబర్ 10, ఆదివారం నాడు నిర్వహించనున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికల తేదీ ఖరారు కావడంతో అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థులు ప్యానెల్ ఏర్పాటు, ప్రచారంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ శుక్రవారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన ప్యానెల్ ను ప్రకటించారు.

ముందుగా గత కొన్నిరోజులుగా నటి జీవిత రాజశేఖర్, నటి హేమ కూడా మా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే వారు అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని, తన ప్యానల్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. సినిమా పరిశ్రమకు ఎంతో చేయాలని ఉందని, తమకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తామని అన్నారు. అలాగే సిని’మా’ బిడ్డలు పేరుతో 26 మందితో కూడిన తన ప్యానెల్ సభ్యుల వివరాలను ప్రకాశ్‌ రాజ్‌ వెల్లడించారు.

ప్రకాశ్ రాజ్ ప్యాన‌ల్‌ :

  • ప్రెసిడెంట్ : ప్రకాశ్ రాజ్
  • ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ – శ్రీకాంత్‌
  • వైస్‌ ప్రెసిడెంట్‌ – బెనర్జీ
  • వైస్‌ ప్రెసిడెంట్‌ – హేమ
  • జనరల్‌ సెక్రటరీ – జీవితా రాజశేఖర్‌
  • జాయింట్‌ సెక్రటరీ – అనితా చౌదరి
  • జాయింట్‌ సెక్రటరీ – ఉత్తేజ్‌
  • ట్రెజరర్‌ – నాగినీడు

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబెర్స్:

  • అనసూయ
  • అజయ్‌
  • భూపాల్
  • బ్రహ్మాజీ
  • ప్రభాకర్‌
  • గోవిందరావు
  • ఖయ్యూం
  • కౌశిక్‌
  • ప్రగతి
  • రమణరెడ్డి
  • శివారెడ్డి
  • సమీర్‌
  • సుడిగాలి సుధీర్‌
  • డి.సుబ్బరాజు
  • సురేశ్‌ కొండేటి
  • తనీశ్‌
  • టార్జాన్‌
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ