‘సిరివెన్నెల’ మనకిక లేదు, సాహిత్యానికి ఇది చీకటి రోజు – మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi, Pawan Kalyan and others Mourns the Death of Noted Lyricist Sirivennala Seetharama Sastry

ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్విట్టర్ వేదికగా ‘సిరివెన్నెల’ మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజుని పేర్కొన్నారు.

జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్​ స్పందిస్తూ తెలుగు సాహిత్యానికి సీతారామశాస్త్రి మరణం తీరని లోటని చెప్పారు. ఆయన లేరన్న వార్త జీర్ణించుకోలేనిదని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటని, తన పట్ల ఆయన ఎంతో ఆప్యాయతను కనబరిచేవారని వారి మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ