మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్

Chiranjeevi, Chiranjeevi Tested Covid Negative, Chiranjeevi Tests Covid Negative, Mango News Telugu, Megastar, Megastar Chiranjeevi Tested Covid Negative, Megastar Chiranjeevi Tested Negative, Telugu megastar Chiranjeevi tests negative

ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా‌ నెగెటివ్ గా‌ వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం నాడు ఆయన ట్విట్టర్ లో అభిమానులకు షేర్ చేశారు. “కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ అన్న తరవాత, బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేసాను, రెండు రోజులైన ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చి అపోలో డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు అక్కడ సిటీ స్కాన్ తీసి చెస్ట్ లో ఎలాంటి ట్రెసెస్ లేవు అన్న నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగటివ్ వచ్చాక, మరొక్కసారి మరోచోట నివృత్తి చేసుకుందామని, నేను టెనెట్ ల్యాబ్ లో 3 రకాల కిట్స్ లతో టెస్ట్ కూడా చేయించాను. అక్కడా నెగటివ్ వచ్చింది. ఫైనల్ గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తరవాత మొదటి రిపోర్ట్ ఫాల్టీ కిట్ (కిట్‌లో లోపం) వలన వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకి వచ్చారు. ఈ సమయంలో మీరందరు చూపించిన ప్రేమాభిమానాలకి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చిరంజీవి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ