ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్

Cs Santhi Kumari Held Video Conference With Collectors Over Oil Palm Cultivation Double Bed Houses Kanti Velugu, Cs Santhi Kumari Held Video Conference, Cs Santhi Kumari Video Conference With Collectors,Cs Santhi Kumari Over Oil Palm Cultivation, Cs Santhi Kumari Over Double Bed Houses, Cs Santhi Kumari Over Kanti Velugu, Mango News, Mango News Telugu, A Santhi Kumari Ias,Double Bedroom Application Status Check,Double Bedroom Sanction List,Kcr Double Bedroom Hyderabad,Palm Oil Cultivation In Telangana,Palm Oil Tree Cultivation,Palm Oil Tree Farming In India,Palm Oil Tree In India,Santhi Kumari,Santhi Kumari Ias,Santhi Kumari Ias Profile,Telangana Double Bedroom Eligibility,Telangana Double Bedroom Status

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను జిల్లా కలెక్టర్లు సకాలంలో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఆదేశించారు. శుక్రవారం సీఎస్ శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, ప్రభుత్వ జి.ఓ. 58, 59, 76 ల ప్రకారం క్రమబద్దీకరణ, జిల్లాలలో ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

కంటి వెలుగు కార్యక్రమం:

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు కృషి చేసినందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 పని దినాలలో 51.86 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, 9 లక్షల రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కంటి వెలుగు శిబిరాలను జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు సందర్శించాలని సీఎస్ ఆదేశించారు. ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమం:

తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా 2023 -24 సంవత్సరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు గాను వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. మొక్కల సంరక్షణ కోసం నీటి వినియోగం సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలని ఆధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల సాధనకు జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని ఆమె అన్నారు. జిల్లాలో సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

జిఓ 58, 59, 76 క్రింద పట్టాల పంపిణీ:

జి.నెం.58 సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జిఓ 58, 59, 76 క్రింద పట్టాల పంపిణీ ప్రారంభించి మార్చి చివరి వరకు పూర్తి చేయాలి. రాష్ట్రంలో నిరుపేదలకు భూమి పట్టాలను ప్రధానం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు కృషి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ కమీషనర్ సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ శ్వేతా మొహంతి, పీసీసీఎఫ్ డోబ్రియాల్, హార్టికల్చర్ డైరెక్టర్ హన్మంతరావు, సీసీఎల్‌ఏ ప్రత్యేక అధికారి సత్యశారద, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − seven =