ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, Andhra Pradesh Reduction of Corona Test Prices, AP Corona Test Prices, AP Govt Issued Orders to Private Labs, AP Govt over Reduction of Corona Test Prices, COVID-19, COVID-19 Daily Bulletin, Mango News Telugu, Reduction of Corona Test Prices, Reduction of Corona Test Prices In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఐసీఎంఆర్‌, ఎన్‌ఏబీఎల్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా పరీక్షలకు చెల్లించే ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల ధరలు తగ్గింపుపై గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన శాంపిల్స్ ను టెస్ట్ చేసేందుకు రూ.800 ధర మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే నేరుగా ప్రైవేట్‌ ల్యాబ్స్ కు పరీక్షల కోసం వచ్చే వారి నుంచి రూ.1000 రూపాయల వరకు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా పరీక్షల కిట్లు మార్కెట్ లోకి పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతోనే ధరలు తగ్గించాలని నిర్ణయించినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =