బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి ‘కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్’ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శనివారం తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎక్విప్మెంట్ మేనేజ్‌మెంట్ పాలసీ అమలు కోసం ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశామని తెలిపిన మంత్రి నేటి నుంచే పాలసీ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ విధానంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాదిరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరికరాలను కూడా త్వరిత గతిన రిపేర్ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
ఇక తెలంగాణలో గర్భిణీలకు ‘కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్’ అందించటానికి ఏర్పాట్లు చేతున్నామని తెలిపిన మంత్రి, బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి వాటిని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ముందుగా ఎనీమియా ప్రభావం ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ములుగు, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, జోగులాంబ గద్వాల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఈ కిట్స్ పంపిణీ చేస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం ఈ కిట్లు అందిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, దీనిద్వారా సుమారు 1.50 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రూ.2 వేలు విలువ చేసే ఈ కిట్‌లో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్ కిలో బాటిల్స్ 2, ఒక కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ బాటిల్స్ 3, అర కేజీ నెయ్యి ఉంటాయని వివరించారు. అలాగే డెలివరీ సమయం లోపు రెండు సార్లు ఈ కిట్‌ను అందిస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY