వైఎస్‌ఆర్‌టీపీకి అన్ని పార్టీల నుంచి మిస్డ్ కాల్స్, ప్రస్తుతం చార్జింగ్ మోడ్‌లో ఉన్నాం – వైఎస్ షర్మిల

YS Sharmila Gives Clarity Over The News That YSRTP Will Merge with Congress Party Soon,YS Sharmila Gives Clarity Over The News,YSRTP Will Merge with Congress Party Soon,Mango News,Mango News Telugu,YS Sharmila Reacts On YSRTP Alliance,YS Sharmila Comments On Congress Party,YS Sharmila,YS Sharmila Latest News And Updates,Congress Party,Congress Party Latest News And Updates,YSRTP Will Merge with Congress Party,YSRTP,YSRTP Latest News,YSRTP Latest Updates

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, అవగాహన తదితర అంశాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో ఆ ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కానుందనే ప్రచారం విస్తృతంగా వినిపిస్తోంది. తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను వైఎస్ షర్మిల కలిశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దీనిపై వివరణ ఇచ్చారు.

మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడానికి తాను రాజకీయ పార్టీని పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీల నుంచి తమకు మిస్డ్‌ కాల్స్ వస్తున్నాయని, అయితే ప్రస్తుతం తాము ఛార్జింగ్ మోడ్‌లో ఉన్నామని తెలిపారు. కాగా తన పార్టీని విలీనం చేయాలి అనుకుంటే అది ఎప్పుడో జరిగేదని, 3, 800 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాల్సిన అవసరమే వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. తాను వస్తానంటే ఏ పార్టీ కూడా వద్దు అనదని, అయినా కూడా తాను సొంతంగానే రాజకీయాల్లో నిలబడాలని అనుకుంటున్నట్లు వివరించారు వైఎస్ షర్మిల. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, ప్రజలు 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారిలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే పార్టీలో ఉన్నారని అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని స్థితిలో తెలంగాణ నాయకత్వం ఉందని, పార్టీ నుంచి వెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చే సత్తా ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు.

ఇటీవల ఓ జాతీయ సంస్థ చేసిన సర్వేలో తెలంగాణలో 43 నియోజకవర్గాలలో వైఎస్‌ఆర్‌టీపీ ప్రభావం చూపిస్తుందని తేలిందని, అలాంటప్పుడు 10, 20 సీట్ల కోసం పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌టీపీ అని, వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదని షర్మిల అభిప్రాయపడ్డారు. ఇక బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీపై స్పందిస్తూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే డీకే శివకుమార్ రాజకీయం చేశారని, కష్టపడి పార్టీని గెలిపించారని, వ్యక్తిగతంగా ఉన్న అనుబంధంతోనే ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పానని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =