మహబూబ్‌నగర్ ఫ్రీడమ్‌ ర్యాలీలో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, విమర్శలపై వివరణ

Minister Srinivas Goud Gives Clarity Over Gun Firing Incident at Mahabubnagar Freedom Rally, Srinivas Goud Gives Clarity Over Gun Firing Incident at Mahabubnagar Freedom Rally, Gun Firing Incident at Mahabubnagar Freedom Rally, Mahabubnagar Freedom Rally, Gun Firing Incident, Minister Srinivas Goud, Mahabubnagar Freedom Rally News, Mahabubnagar Freedom Rally Latest News And Updates, Mahabubnagar Freedom Rally Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వివాదంలో చిక్కుకున్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లో స్వతంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో మంత్రి అత్యుత్సాహంతో తుపాకీతో కాల్పులు జరిపారు. తన పక్కనున్న పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకుని మరీ ఆయన గాల్లోకి కాల్పులు జరిపడం విశేషం. అయితే ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవడంతో మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినవచ్చాయి. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కాల్పులు జరుపుతుండగా కనీసం అధికారులు కూడా ఆయన్ని అడ్డుకోలేదని విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

దీంతో పరిస్థితిని గమనించిన మంత్రి ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని ఆయన తెలిపారు. ఇంకా తాను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్‌నని, క్రీడా శాఖమంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుందని అన్నారు. కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జిల్లా ఎస్పీ గన్ ఇస్తేనే నేను కాల్చానని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ర్యాలీ ప్రారంభం చేసే క్రమంలో సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారని తెలిపిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, తాను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తా అని స్పష్టం చేశారు. గన్ కు సంబంధించిన నిబంధనలపై తనకు అవగాహన ఉందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =