అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న వారు రియల్ హీరోలు అంటూ తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఈ మేరకు వారికీ అభినందనలు తెలుపుతూ, సంబంధిత వివరాలను షేర్ చేస్తూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
“కుకునూర్ పల్లి మండలం, చిన్న కిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడగా, హైదరాబాద్ హయత్ నగర్ లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి రాచకొండ పరిధిలోని రామన్నపేట సీఐ మానవత్వం చాటుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు అభినందనలు.
కుకునూర్ పల్లి మండలం, చిన్న కిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడగా, హైదరాబాద్ హయత్ నగర్ లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి… pic.twitter.com/AGYopAGmc9
— Harish Rao Thanneeru (@BRSHarish) March 31, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE







































