భవిష్యత్తు తరాల వారికీ ఉపయోగపడేలా.. వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే – సీఎం జగన్

CM Jagan Held Review on YSR Jagananna Saswatha Bhu Hakku and Bhu Raksha Scheme, Orders To Expedite Land Survey,CM Jagan Held Review on YSR Jagananna Saswatha Bhu Hakku,CM Jagan Held Review on Bhu Raksha Scheme,YSR Jagananna Saswatha Bhu Hakku,Bhu Raksha Scheme,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,YSR Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,YSR Jagananna Saswatha Bhu Hakku News Today,Bhu Raksha Scheme Latest Updates

భవిష్యత్తు తరాల వారికీ ఉపయోగపడేలా ‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే’ చేపట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన ఈ పథకం పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంత పెద్దఎత్తున సర్వే నిర్వహించడం లేదని, ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన కార్యక్రమం ఇదని పేర్కొన్నారు. ఇక జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరూ టాంపర్ చేయలేని విధంగా హక్కు పత్రాలను అందజేస్తున్నామని తెలియజేశారు.

నిర్ధేశించిన లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జాప్యం లేకుండా అవసరమైన సాంకేతిక పరికరాలను తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు. దేవాదాయ శాఖ పరిధిలో మొదటి దశలో చేపట్టిన 2000 గ్రామాల్లో సర్వే ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన మే 20లోగా సర్వే రాళ్లు వేసే పనులతో పాటు సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రతి గ్రామ సచివాలయంలో సర్వే పరికరాలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇక సర్వే పూర్తయిన తర్వాత సరిహద్దుల్లో పాతడానికి దాదాపు 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధం చేశామని, రోజుకు 50 వేల సర్వే రాళ్లను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ఏప్రిల్ మూడో వారం లోగా 300 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేస్తామని, డిసెంబర్ నాటికి అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పంచాయతీరాజ్ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా తదుపరి దశల్లో నిర్వహించే సర్వే ప్రక్రియకు రాళ్ల కొరత లేకుండా ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =