అమరావతి రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు – టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu Congratulates Amaravati Farmers as Their Protest Completed 1200 Days,Chandrababu Naidu Congratulates Amaravati Farmers,TDP Chief Chandrababu Naidu,Farmers as Their Protest Completed 1200 Days,Amaravati Farmers Protest Completed 1200 Days,Mango News,Mango News Telugu,Amaravati Farmers Latest News,TDP Chief Chandrababu Naidu Latest News,Telugu Desam Party,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1200 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం అమరావతి పరిధిలోని మందడంలో రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా ఏపీలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చంద్రబాబు నాయుడు ఇలా తెలిపారు.. ‘రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు. మీ ఉద్యమంలో న్యాయం ఉంది… మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే’ అని పేర్కొన్నారు.

మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమార్తి అనురాధ, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, వైసీపీ బహిష్కృత నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తదితరులు మందడం లోని దీక్షా శిబిరానికి చేరుకుని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమరావతి కోసం 34 వేల ఎకరాలు, 29 గ్రామాలు, ఐదుకోట్ల ప్రజల కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రధాని స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అమరావతి రాజధానికి అండగా ఉంటామని భరోసానిచ్చారని తెలిపారు. 1200 రోజులుగా వందలాది కేసులతో ఇబ్బందులు పెడుతున్నా భయపడకుండా అమరావతి ఉద్యమం కొనసాగిస్తున్న రైతులకు నేతలు అభినందనలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here