అత్యవసర సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు అభినందనలు: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Congratulates Real Heroes who are Saving Lives by Doing CPR During Emergency Situations,Minister Harish Rao Congratulates Real Heroes,Harish Rao Congratulates who are Saving Lives by Doing CPR,Real Heroes Doing CPR During Emergency Situations,Minister Harish Rao,Mango News,Mango News Telugu,Minister Harish Rao Tweet On CPR,Harish Rao About CPR,Minister Harish Rao Latest News,Minister Harish Rao Latest Updates,Telangana Latest News And Updates

అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న వారు రియల్ హీరోలు అంటూ తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు కొనియాడారు. ఈ మేరకు వారికీ అభినందనలు తెలుపుతూ, సంబంధిత వివరాలను షేర్ చేస్తూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

“కుకునూర్ పల్లి మండలం, చిన్న కిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడగా, హైదరాబాద్ హయత్ నగర్ లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి రాచకొండ పరిధిలోని రామన్నపేట సీఐ మానవత్వం చాటుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =