హైదరాబాద్ నగరంలో హూస్సేన్ సాగర్ తీరాన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పనులను రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. 50 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 175 అడుగులలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విగ్రహ ఏర్పాటుతో పాటు ఇతర పనులకు రూ. 100 కోట్లతో టెండర్లు ఇచ్చామని చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తర్వాత ఇదే ఎత్తైనది, అలాగే అంబేద్కర్ విగ్రహాలలో ఇదే అతి పెద్దది, ఎత్తైనదని పేర్కొన్నారు.
ఈ విగ్రహాన్ని 11.4 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ మ్యూజియం, ఫోటోల ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్ గ్రంథాలయం, ధ్యానమందిరం, సమావేశ మందిరం, లేజర్ షో, క్యాంటీన్, సువిశాలమైన పార్కింగ్, వాష్ రూంలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక్కడ స్కిల్స్ డెవలప్ మెంట్ వర్క్ షాపులు, సెమినార్లు జరుగుతాయన్నారు. దీనిని పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్ లో ఇది ముఖ్య పర్యాటక ప్రదేశంగా వెలుగొందనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడించే విధంగా, నగరానికి మరింత వన్నె తెచ్చే విధంగా ఈ నిర్మాణం ఉంటుందని, దీనిని త్వరితగతిన పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును 12 నెలల నుంచి 15 నెలల్లో పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ