నేడు భారత్‌ లో పాక్షిక సూర్యగ్రహణం, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల మూసివేత

Partial Solar Eclipse Will Occurs In India On Today Famous Temples Closed Across The Country, Partial Solar Eclipse Will Occurs In India On Today, Famous Temples Closed Across The Country, Partial Solar Eclipse, Mango News, Mango News Telugu, Solar Eclipse Will Occurs In India, Partial Solar Eclipse In India, Solar Eclipse In India, Solar Eclipse In India News And Live Updates, Trumala Closed Amid Solar Eclipse, Yadadri Closed Amid Solar Eclipse, TTD, Yadardri Temple

ప్రపంచంలోని అనేక దేశాల్లో నేడు (అక్టోబర్ 25, మంగళవారం) పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారతదేశంలో కూడా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని రాష్ట్రాల్లో మినహా చాలా రాష్ట్రాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. న్యూఢిల్లీలో సాయంత్రం 16:29 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై, 18:26 గంటలకు ముగియనుంది. ప్రాంతాలను బట్టి గ్రహణ సమయాల్లో పలు స్వల్ప మార్పులు ఉండనున్నాయి. హైదరాబాద్ లో సాయంత్రం 16:58 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై, 17:48 గంటలకు ముగియనున్నట్టు తెలుస్తుంది.

పాక్షిక సూర్యగ్రహణంలో ప్రారంభం, గరిష్ట పాయింట్ మరియు ముగింపు, ఇలా మూడు దశలు ఉండగా, దేశంలో గరిష్ట గ్రహణ సమయం సాయంత్రం 05:30 గంటలకు ఉండనుంది. కాగా 2022వ సంవత్సరంలో ప్రపంచంలో ఏర్పడే సూర్యగ్రహణం ఇదే చివరిదని పేర్కొన్నారు. సూర్యగ్రహణం కొద్దిసేపే అయినప్పటికీ కంటితో నేరుగా చూడకూడదని, ఇక గ్రహణం యొక్క ముగింపు భారత్ లో సూర్యాస్తమయం తర్వాత పురోగతిలో ఉంటుంది కాబట్టి కనిపించదని తెలిపారు. సాయంత్రం సమయంలో గ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో మధ్యాహం 3 నుంచి రాత్రి 10 గంటల మధ్య కొంత ఆహార నియమాలను ప్రజలు పాటిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.

మరోవైపు సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం, శ్రీశైలం, యాదాద్రి, భద్రాచలం, విశాఖ సింహాచలం ఆలయం, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం సహా పలు ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. “అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా మంగళవారం ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి వేయనున్నాము. అనంత‌రం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమతిస్తాం” అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సూర్యగ్రహణం కారణంగా అక్టోబర్ 25, మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి అక్టోబర్ 26, బుధవారం ఉదయం 8 గంటల వరకు యాదాద్రి ఆలయాన్ని మూసివేయనున్నట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =