హైదరాబాద్ నగరంలో మంగళవారం నాడు గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్ వరకు తొలిసారిగా మెట్రోరైలులో విజయవంతంగా గుండెను తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రో రైలులో గుండె తరలింపుపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో హృదయపూర్వక చర్యగా అభివర్ణించారు. ప్రాణాలను కాపాడటానికి 21 కిలోమీటర్ల దూరంపాటు గుండె తరలింపు చేయడానికి ప్రత్యేక రైలును నడిపిన హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే అవయవ దానం కోసం ముందుకు వచ్చిన దాత నర్సీరెడ్డి కుటుంబానికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ముందుగా నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల నర్సిరెడ్డి అనే రైతు బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన గుండెను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. సంప్రదింపుల అనంతరం గుండెను తరలించి అపోలో ఆసుపత్రిలో ఓ వ్యక్తికీ శస్త్రచికిత్స ద్వారా అమర్చేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. శస్త్రచికిత్స నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడంలో భాగంగా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి మెట్రో రైల్ ద్వారా గుండె తరలింపు ప్రక్రియను మంగళవారం నాడు చేపట్టారు. ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు రోడ్డుమార్గంలో, నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మెట్రో రైలులో, అనంతరం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్ నుంచి అపోలో ఆస్పత్రి వరకు మళ్లీ రోడ్డుమార్గంలో గుండెను విజయవంతంగా తరలించారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మొత్తం 21 కిలోమీటర్ల దూరాన్ని మెట్రో రైలు 30 నిమిషాల్లో చేరుకుంది.
What a heartwarming gesture!!@hmrgov and @ltmhyd have run a special train to help transport a live heart over 21km to save a life. My compliments to NVS Reddy & KVB Reddy 👍
Also kudos to the family of the donor Narsi Reddy Garu whose family came forward for organ donation 👏 pic.twitter.com/ficNjBTkNp
— KTR (@KTRTRS) February 3, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ