కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ

AP TDP MPs Meet Union Home Minister Amit Shah at Delhi Today

బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. దాదాపు 20 నిముషాలు సాగిన ఈ భేటీలో ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితుల సహా పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. అమిత్ షాతో భేటీ అనంతరం ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై మాట్లాడానికి హోమ్ మంత్రి అమిత్ షాను కలిసినట్టు చెప్పారు. ప్రజాస్వామ్య సంస్థలు, ప్రజాస్వామ్య అధికారులుపై రాష్ట్రంలో విమర్శలు చేస్తునట్టు వివరించామన్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాల నేతలపై దాడులు, మత మార్పిడులు, ఆలయాలపై దాడులు జరుగుతుండడాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. వీటన్నింటికి సంబంధించి ప్రూఫ్ తో కూడిన ఒక లెటర్ ను అమిత్ షాకు అందజేసినట్టు తెలిపారు. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగ సంస్థలను పనిచేయనీయడం లేదని, శాసన మండలి రద్దుకు చూస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ ను స్వతంత్రంగా పనిచేయనీయడం లేదని వివరించి, ఆ అంశాలను పరిశీలించాలని హోమ్ మంత్రి అమిత్ షాను కోరినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 4 =