త్వరలో గోల్కొండ కోట మీద బీజేపీ జెండా ఎగురవేస్తాం – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

BJP State President Bandi Sanjay Kumar Says BJP will Form Govt After Elections in Telangana, BJP State President Says BJP will Form Govt After Elections in Telangana, Bandi Sanjay Kumar Says BJP will Form Govt After Elections in Telangana, BJP Telangana State President Bandi Sanjay Kumar Says BJP will Form Govt After Elections in Telangana, BJP Telangana Chief Bandi Sanjay Kumar Says BJP will Form Govt After Elections in Telangana, BJP will Form Govt After Elections in Telangana Says BJP State President Bandi Sanjay Kumar, BJP will Form Govt After Elections in Telangana, BJP will Form Govt in Telangana, Elections in Telangana, Telangana BJP State President Bandi Sanjay Kumar, BJP State President Bandi Sanjay Kumar, Telangana BJP State President, Bandi Sanjay Kumar, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మంగళవారం నుంచి ప్రారంభం అయింది. ఈ సందర్భంగా యాదరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని వంగపల్లి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎదురుగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డిలు హాజరయ్యారు. ఇక బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. త్వరలో గోల్కొండ కోట మీద బీజేపీ జెండా ఎగురవేస్తామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన అనంతరం ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పట్ల ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ ఆగం అవుతున్నారని సంజయ్ పేర్కొన్నారు.

గురుకుల పాఠశాలల్లో పిల్లలకు మంచి భోజనం అందించడం లేదని, మరోవైపు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్టంలోని రైతులకు ఫ్రీ యూరియా ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ దానిని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. తన మొదటి విడత పాదయాత్ర సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చామని, ఇక రెండో విడతలో ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చామని బండి గుర్తు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, క్యాసినోలు జోరుగా సాగుతున్నాయని, వీటిలో అధికారపార్టీ నాయకులకు సంబంధాలున్నాయని బండి సంజయ్ విమర్శించారు.

ఇక ఈ సభలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రజలు బండి సంజయ్ చేపట్టిన తొలి రెండు విడతల పాదయాత్రను ఆశీర్వదించారని, అలాగే ఈ మూడవ విడత పాదయాత్ర కూడా విజయవంతం చేయాలనీ కోరారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, వారిని ఇంటికి పంపితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని పేర్కొన్నారు. ఇక మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు నష్టపోతుంటే పట్టించుకోని కేసీఆర్ సొంత ప్రచారం కోసం పంజాబ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడి రైతులకు డబ్బులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేంద్రం భువనగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించిందని, అలాగే లక్ష కోట్లకు పైగా జాతీయ రహదారుల కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =