ఈ-వాచ్‌ యాప్‌ ఆవిష్కరించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP Political Updates, AP SEC, AP SEC Nimmagadda Ramesh, AP SEC Nimmagadda Ramesh Unveils eWatch App, eWatch App to Receive Complaints over Panchayat Elections, Mango News, Nimmagadda Ramesh, Panchayat polls

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణ కోసం రూపొందించిన ‘ఈ-వాచ్‌’ యాప్ ‌ను ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ బుధవారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ-వాచ్ యాప్ ఆవిష్కరణ అనంతరం నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా చోటుచేసుకునే ప్రలోభాలు, ఇతర అక్రమాలపై ఈ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదులు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు.

యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాత వారికీ తెలియజేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అన్నారు. ఎన్నికలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడంతో పాటుగా, ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ఈ యాప్ తీసుకొచ్చామని, ఇది కచ్చితంగా విజయవంతమవుతుందని చెప్పారు. ఇక ఫిబ్రవరి 4, గురువారం నుండి ప్లేస్టోర్‌లో ఈ యాప్ ప్రజలకు ‌ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అలాగే పంచాయతీ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఈ రోజు ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 5 =