శానిటేష‌న్, ఎంట‌మాల‌జి సిబ్బందికి పి.పి.ఇ సేఫ్టీ కిట్స్ పంపిణీ చేసిన మంత్రి కేటిఆర్

Coronavirus, COVID-19, KTR, KTR Distributed PPE Kits, Minister KTR, Minister KTR has Distributed Safety PPE Kits, Minister KTR Latest News, PPE Kits to Sanitation and Entomology Workers, telangana, Telangana Coronavirus

కోవిడ్ -19 నియంత్రణలో జిహెచ్‌ఎంసి లోని శానిటేషన్, ఎంటమాలజీ, డి.ఆర్.ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అభినందించారు. జూలై 6, సోమవారం నాడు ఫతుల్లాగూడ లోని యానిమల్ కేర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శానిటేషన్, ఎంట‌మాలజీ సిబ్బంది కి “పి.పి.ఇ సేఫ్టీ కిట్స్” పంపిణీ చేశారు. ప్రస్తుతం రూ.13 కోట్ల వ్యయంతో 22 వేల మంది శానిటేషన్, 2500 మంది ఎంటమాలజీ సిబ్బందికి పి.పి.ఇ సేఫ్టీ కిట్స్ ఇస్తున్నట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు. కిట్స్ ను రెగ్యులర్ గా వినియోగించాలని సిబ్బందికి మంత్రి కేటిఆర్ సూచించారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టుట‌లో శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జి సిబ్బంది సేవ‌ల‌ను గుర్తించి ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల ఆరోగ్యం, ర‌క్ష‌ణ‌తో పాటు కుటుంబ స‌భ్యులు ఆరోగ్యాన్ని కాపాడుట‌కు ఇంటి వ‌ద్ద కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలిపారు. గతంలో అత్యవసరంగా 1,80,000 మాస్కులు, 27 వేల హ్యాండ్ గ్లోవ్స్, 25 వేల లీటర్లు హ్యాండ్ శానిటైజర్ ను శానిటేషన్, ఎంట‌మాలజీ సిబ్బందికి సర్కిళ్ల వారిగా పంపిణీ చేసిన‌ట్లు జిహెచ్‌ఎంసి డి.ఎస్‌.లోకేష్ కుమార్ మంత్రికి వివ‌రించారు. మూడు వారాల్లో అందరికి పి.పి.ఇ సేఫ్టీ కిట్స్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా యానిమల్ కేర్ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌ను మంత్రి ప‌రిశీలించారు. అదేవిధంగా ఎంట‌మాల‌జి విభాగం ఏర్పాటు చేసిన దోమ‌ల నివార‌ణ స్టాల్‌ను కూడా మంత్రి కేటిఆర్ సంద‌ర్శించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu