నేడు తెలంగాణ ఫుడ్ బౌల్, సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోంది – ఫుడ్‌ కాంక్లేవ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

Minister KTR Inaugurates The Food Conclave-2023 at HICC Near Hitech City Hyderabad,Minister KTR Inaugurates The Food Conclave-2023,Food Conclave-2023 at HICC Near Hitech City,Food Conclave-2023 at HICC Hyderabad,Mango News,Mango News Telugu,1st Edition of "The Food Conclave 2023,Food Conclave 2023 in Hyderabad,Telangana govt to host Food Conclave 2023,Minister Sri. KTR Participating in Inaugural Ceremony,Food Ingredients Conclave 2023 Hyderabad,Minister KTR Latest news and Updates,Food Conclave-2023 Latest News and Updates

నేడు తెలంగాణ ఫుడ్ బౌల్ మరియు సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోందని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలో గల హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఫుడ్‌ కాంక్లేవ్‌ – 2023ను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‎తో కలిసి మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం హార్టికల్చర్, డైరీ రంగాలను ప్రోత్సహిస్తున్నదని, దీనిలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, వెటర్నరీ వర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇక మత్స్య సంపదలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందని, అలాగే పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఈ క్రమంలో విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు సైతం ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని వెల్లడించారు.

కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వలన విజయ డైరీ కూడా లాభాల బాటలో పయనిస్తోందని, ఈ డెయిరీ ద్వారా అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అలాగే తాము అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్ ఐపాస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దీనిద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సరళతరమైన విధానాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని పేర్కొన్నారు. ఇది అమలులోకి వచ్చాక రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎవరినీ కలవాల్సిన అవసరం లేదని, వారే నేరుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, తద్వారా కేవలం 15 నుంచి 21 రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులు లభిస్తాయని స్పష్టం చేశారు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేయదలిస్తే అందుకు కావాల్సిన ముడిపదార్థాలను గ్రామీణ ప్రాంతాల నుంచి అందించేందుకు అధికారులు సహకారం అందిస్తారని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని, దళితబంధు పథకం కింద ఇస్తున్న రూ.10 లక్షల ఆర్ధిక సాయంతో నలుగురు చొప్పున కలిసి రూ.40 లక్షలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here