హైదరాబాద్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 26 వరకు మూడు రోజుల పాటుగా బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2023 (20వ ఎడిషన్) జరగనుంది. ఈ అతిపెద్ద లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్‌టెక్ ఈవెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బయో ఆసియా అఫీషియల్ 20వ ఎడిషన్ లోగోను, థీమ్‌ను మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అడ్వాన్సింగ్ ఫర్ వన్-షేపింగ్ ది నెక్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్ అనే థీమ్‌తో బయో ఆసియా సదస్సు-2023ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మరియు లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ మరియు బయో ఆసియా సీఈఓ శక్తి నాగప్పన్ కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాలను http://2023.bioasia.in/ వెబ్ సైట్ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ సదస్సుకు ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల లీడర్స్, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు మరియు ఇతరులు హాజరవుతారని తెలిపారు. అలాగే ప్రపంచంలోని పలుదేశాల నుంచి నుంచి జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఫార్మా, ఆరోగ్య రంగాల అభివృద్ధి, పరిశోధనలపై చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY