తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుంచి సినిమా షూటింగ్స్​కు గ్రీన్​సిగ్నల్

Telugu Film Producers Guild Gives Green Signal For The Movie Shootings From September 1, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Ace Producer Dil Raju, Tollywood Producers, Telugu Movie Producers, Ticket Prices, OTT Releases, Workers Wages, Artists Remunerations, Production Costs, Federation Issues, Tollywood Shooting Resumes From September 1st, Telugu Movie Shootings will Resume From 1st September, Telugu Film Producers Guild, Mango News, Mango News Telugu,

టాలీవుడ్ సినిమా షూటింగులకు సంబంధించి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన సినిమా షూటింగ్స్​కు గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్స్ యథావిధిగా పునఃప్రారంభించుకోవచ్చని నిర్మాతలకు సూచించింది. ఈ మేరకు సినిమా షూటింగులపై బంద్ ఎత్తేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. గత 23 రోజులుగా నిర్మాతలు సహా మిగిలిన శాఖలతో రోజుకు ఐదారు గంటలు చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం మూవీ ఆర్టిస్టుల మేనేజర్లతో సమావేశం జరిగిందని, ఆగస్టు 30న తుది నిర్ణయాలు ఇండస్ట్రీకి వెల్లడిస్తామని ఆయన అన్నారు. అలాగే ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు మధ్య వీపీఎఫ్ సమస్య పరిష్కారమైందని, -సెప్టెంబర్ 2 నుంచి వీఫీఎఫ్ ఛార్జీలు వసూలు చేయబోమని దిల్ రాజు స్పష్టం చేశారు. అయితే ప్రాధాన్యతా క్రమంలో గురువారం నుంచి సినిమా షూటింగ్‌లకు అనుమతిస్తామని, ఎవరైనా అత్యవసరం అనుకుంటే ఛాంబర్ అనుమతితో షూటింగ్లు ప్రారంభించుకోవచ్చని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది.

కాగా కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా షూటింగ్స్ నిలిచిపోవడం, నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, అలాగే మరోవైపు రోజువారీ కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినిమా టెక్నీషియన్స్ మరియు జూనియర్ ఆర్టిస్ట్​లు సమ్మెకు దిగడం వంటి పరిణామాల నేపథ్యంలో.. టాలీవుడ్‌లో ఆగష్టు 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్స్​ను నిలిపివేశారు. దీంతో ఆ రోజు నుంచి తెలుగు సినిమా చిత్రీకరణలేవీ జరగడం లేదు. అయితే ఈ క్రమంలో పలు దఫాలుగా సమావేశమైన ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతల సమస్యల పరిష్కారం దిశగా కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయించుకోవడంతో మళ్ళీ సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల్లో భాగంగా సినిమా థియేటర్​లో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. అలాగే సినిమా థియేటర్లలో టికెట్‌ ధరలు, స్నాక్స్ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =