స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణ, విధివిధానాలపై ఆగస్టు 2న సీఎం కేసీఆర్ సమావేశం

CM KCR to Held Meeting to Decide Guidelines of Swatantra Bharatha Vajrotsavalu on August 2, Telangana CM KCR to Held Meeting to Decide Guidelines of Swatantra Bharatha Vajrotsavalu on August 2, KCR to Held Meeting to Decide Guidelines of Swatantra Bharatha Vajrotsavalu on August 2, Meeting to Decide Guidelines of Swatantra Bharatha Vajrotsavalu on August 2, Guidelines of Swatantra Bharatha Vajrotsavalu on August 2, Swatantra Bharatha Vajrotsavalu on August 2, Swatantra Bharatha Vajrotsavalu Guidelines, Independence Day celebrations, Telangana Independence Day celebrations, Meeting On Guidelines Swatantra Bharatha Vajrotsavalu, Swatantra Bharatha Vajrotsavalu News, Swatantra Bharatha Vajrotsavalu Latest News, Swatantra Bharatha Vajrotsavalu Latest Updates, Swatantra Bharatha Vajrotsavalu Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి రెండు వారాల పాటు నిర్వహించనున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ కార్యాచరణ, విధివిధానాలు సంబంధిత అంశాలపై కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీతో ఆగస్టు 2, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించనున్నారు.

ముందుగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు, సంబరాలను 15 రోజుల పాటుగా ఘనంగా నిర్వహించాలని నిర్వహించాలని ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం “స్వతంత్ర భారత వజ్రోత్సవాలు” ప్లాన్ చేయడానికి మరియు నిర్వహించడానికి 24 మందితో కూడిన ఒక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా రాజ్యసభ ఎంపీ కె.కేశవ రావు వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశం అయి, స్వతంత్ర భారత వజ్రోత్సవ ఉత్సవాలకు సంబంధించి రోజువారీ కార్యక్రమాలను రూపొందించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆగస్టు 2న జరిగే సమావేశంలో కమిటీ నిర్ణయాలకు, కార్యక్రమ నిర్వహణకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + three =