జూనియర్ డాక్టర్స్ వెంటనే సమ్మెను విరమించాలి: మంత్రి కేటీఆర్

Minister KTR Responds over Junior Doctors Strike, Asked them to Join Duties Immediately

రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని, జూనియర్ డాక్టర్స్ వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరారు. లేని పక్షంలో చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ముందుగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌, రెసిడెంట్‌ డాక్టర్లు బుధవారం ఉదయం నుంచి సమ్మె చేస్తున్నారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ సహా పలు చోట్ల జూనియర్ డాక్టర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన స్టైఫండ్, కొవిడ్ ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సమ్మె నుండి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలకు మినహాయింపునిచ్చి, ఇతర విధులను బహిష్కరించాలని వారు నిర్ణయించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే మే 28 నుంచి కొవిడ్ సహా అత్యవసర సేవలు బహిష్కరిస్తామని, అలాగే సమ్మె ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ