సెప్టెంబర్ 7న జీహెఛ్ఎంసీ టీఆర్ఎస్ శ్రేణుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మావేశం

Minister KTR To held Meeting With GHMC TRS Leaders on September 7th

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 7, మంగళవారం జీహెఛ్ఎంసీ/హైదరాబాద్ పరిధికి చెందిన టీఆర్ఎస్ నాయ‌కులతో సమావేశం కానున్నారు. జ‌ల‌విహార్‌ లో జరగనున్న ఈ సమావేశంలో గ్రేటర్‌ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనేతలంతా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీ గ్రామ, వార్డు క‌మిటీల నిర్మాణం, అలాగే సెప్టెంబ‌ర్ 12 నుంచి 20వ తేదీ లోపల మండ‌ల కార్యవర్గాలు, ప‌ట్ట‌ణ కార్యవర్గాలు నియమించనున్నారు.

ఇక జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సంస్థాగ‌త క‌మిటీలపై ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకుపోతున్నామని మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు. జీహెచ్ఎంసీలో బ‌స్తీ క‌మిటీలు, డివిజ‌న్ క‌మిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమై కమిటీల నిర్మాణంపై నాయకులకు, పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ