బండి సంజ‌య్‌పై ప‌రువు న‌ష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్, 48 గంట‌ల్లో క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్

Minister KTR Issues Legal Notice to BJP Telangana President Bandi Sanjay on Defamation, KTR Issues Legal Notice to BJP Telangana President Bandi Sanjay on Defamation, Telangana Minister KTR Issues Legal Notice to BJP Telangana President Bandi Sanjay on Defamation, Legal Notice to BJP Telangana President Bandi Sanjay on Defamation, Legal Notice to BJP Telangana President Bandi Sanjay Kumar, BJP Telangana President Bandi Sanjay on Defamation, Defamation, Bandi Sanjay on Defamation, Industries Minister KT Rama Rao has served a legal notice to BJP State president Bandi Sanjay, Minister KTR has filed a defamation suit against BJP chief Bandi Sanjay Kumar, MP Bandi Sanjay Kumar, BJP State President Bandi Sanjay, Bandi Sanjay, BJP State President, Bandi Sanjay Kumar, BJP state chief Bandi Sanjay, BJP Telangana President Bandi Sanjay, Telangana BJP President Bandi Sanjay Kumar, Legal Notice Bandi Sanjay, Minister KTR Issues Legal Notice MP Bandi Sanjay Kumar, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన న్యాయవాది ద్వారా పరువునష్టం, అపవాదు అంశాలపై బండి సంజయ్ కు శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు. ముందుగా గురువారం నాడు ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ మాట్లాడిన ఓ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, “హాస్యాస్పదమైన, నిరాధారమైన మరియు బాధ్యతారహితమైన ఆరోపణలను ఆపకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఆరోపించిన అంశంపై రుజువు చేయడానికి ఏదైనా కొంత సాక్ష్యం ఉంటే, దయచేసి దానిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచండి లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని బండి సంజయ్ ను మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బండి సంజ‌య్‌ పై మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేస్తూ త‌న న్యాయ‌వాది చేత నోటీసులు జారీ చేశారు.

48 గంటల్లోగా మంత్రి కేటీఆర్‌ కు బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ తరపు న్యాయవాది వెల్లడించారు. మంత్రి కేటీఆర్ కు ఉన్న పాపులారిటీ నేపథ్యంలో ఆయ‌న‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌చారం పొందే దురుద్దేశంతోనే బండి సంజ‌య్ ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు. సిట్టింగ్ ఎంపీగా, ఎప్పుడూ చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన బాధ్యతను కలిగి ఉంటారని, అయితే కేవలం ప్రచారం కోసం దురుద్దేశంతో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని మంత్రి కేటీఆర్‌కు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారని, చ‌ట్టాల ప్ర‌కారం మంత్రి కేటీఆర్‌కు ప‌రిహారం చెల్లించడంతో పాటుగా, త‌గిన చ‌ర్య‌ల‌కు అర్హుల‌వుతార‌ని న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here