నిద్ర లేదు.. సుఖం లేదు.. దెబ్బ మీద దెబ్బ.. పుండు మీద కాకి పొడిచినట్లు పొడుస్తున్నారంటూ సై సినిమాలో విలన్ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే కేసీఆర్ జారి కిందపడిపోవడంతో ఆయన కాలికి గాయం అయింది. ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కేసీఆర్ కోలుకుంటున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే అంటే మార్చిలో కేసీఆర్ కూతురు.. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ దక్కం లేదు. ఇప్పట్లో కవిత జైలు నుంచి బయటకు రావడం కష్టమేననే మాట బలంగా వినిపిస్తోంది.
ఇదే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై దండయాత్ర మొదలు పెట్టింది. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టి వరుసగా విచారణ కమీషన్లు వేస్తోంది. ఇప్పటికే గతంలో కరెంటు కొనుగోలు విషయంలో అక్రమాల జరిగాయంటూ విచారణ కమీషన్ వేసింది. కేసీఆర్‌కు నోటీసులు కూడా పంపించింది. ఏ చిన్న అవకాశాన్ని కూడా బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దండ యాత్ర చేస్తోంది. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఒక ఎంపీ కాంగ్రెస్ గూటికి చేరడం బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారింది. మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని ప్రచారం జరుగుతుండడంతో.. వారిని కాపాడుకునేందుకు కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తన ఫామ్‌హౌజ్‌లో వరుసగ తన పార్టీ నేతలతో సమావేశమయ్యి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్‌కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. మంత్రి సీతక్క బీఆర్ఎస్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వందకోట్లకు పరువు నష్టం దావా వేశారు. మంత్రి సీతక్కకు సంబంధించి ఇటీవల బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. మంత్రి సీతక్క సొంత జిల్లా అయిన ములుగులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రావాణా జరుగుతోందని.. ఆ మాఫియా వెనుక సీతక్క హస్తం ఉందని బీఆర్ఎస్ ఆరోపించింది. వెంకటాపురం మండలం అలుబాక గ్రామం వద్ద పట్టపగలే లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొంది. ఆ పోస్టుకు ఇందిరమ్మ రాజ్యం.. ఇసుకాసురుల రాజ్యం అంటూ టైటిల్ పెట్టింది.
ఈ మేరకు ఆ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీతక్క.. తాజాగా బీఆర్ఎస్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. ఇది కరెక్ట్ పద్దతి కాదని పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వెల్లడించారు. తనకు లిఖిత పూర్వకంగా బేషరతుగా క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుటి వరకు ఈ నోటీసులపై కేసీఆర్‌కానీ.. బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ స్పందించలేదు. చూడాలి మరి స్పందిస్తారా? లేదా? అన్నది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY