ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, నోటిఫికేషన్ జారీ

Telangana Govt Issues Notification to Start Assembly Budget Session from February 3rd,Telangana Assembly Meetings, Telangana Assembly For A Week,Telangana Assembly In Febreuary, CM KCR Decision,Telangana Assembly,Mango News,Mango News Telugu,Telangana Assembly Session,Telangana Assembly Sessions Febreuary,Telangana Assembly Latest News And Updates,Telangana Assembly on Feb,Telangana Assembly News And Live Updates,Telangana Assembly Live,Telangana New Assembly

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 3, శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండగా, వెంటనే ఉభయ సభలను(శాసన సభ, శాసన మండలి) ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఇక 2023-24 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 6తేదీన శాసన సభ, శాసన మండలిలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ముందుగా తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసన సభ, శాసనమండలి సమావేశం కానున్నట్టు తెలిపారు. ఆ రోజున అసెంబ్లీ హాల్‌ లో ఉభయసభల సంయుక్త సమావేశం జరగనుండగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగానే ఈసారి ఉభయసభలు సమావేశం కానున్నాయి. సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా రెండవ తెలంగాణ అసెంబ్లీ ఎనిమిదో సెషన్‌కు సంబంధించి నాలుగో విడతగా శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నట్టు సమనింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు.

సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాలతో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు రాజ్‌భవన్‌ కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్ తమిళిసైతో మంత్రి, అధికారులు కీలకంగా చర్చించారు. గవర్నర్ ప్రసంగం, సమావేశాలకు నోటిఫికేషన్ జారీ, బడ్జెట్ కు ఆమోదం వంటి అంశాలపై గవర్నర్ తో చర్చించారు. దీంతో ఈ భేటీ అనంతరం బడ్జెట్ ఆమోదంపై ఏర్పడిన సందిగ్ధం తొలిగిపోవడంతో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =