శాసనసభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశాం – మంత్రి వేముల‌

Assembly Sessions Arrangements, Covid negative report must for Telangana Assembly, Minister Vemula Prashanth Reddy, Monsoon session of Telangana Assembly, Telangana Assembly, Telangana Assembly Session, Telangana Assembly Sessions Arrangements, Vemula Prashanth Reddy, Vemula Prashanth Reddy about Assembly Sessions Arrangements

తెలంగాణాలో సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర శాసనస‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, చీఫ్ విప్‌లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో స‌మావేశ‌మయ్యి చర్చించారు.

అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, “అసెంబ్లీ సమావేశాలకు కావాల్సిన ఏర్పాట్ల కోసం సీఎస్ అధ్వర్యంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో ఈ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పార్లమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. అసెంబ్లీ-మండలి హాల్ లో 6 అడుగుల దూరం వచ్చే విదంగా సీట్లు ఏర్పాటు చేశాం. శాసనసభ లో కొత్తగా 40 సీట్లు, కౌన్సిల్ లో 8 సీట్లు ఏర్పాటు చేశాం. జీహెఛ్ఎంసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వాటర్స్, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో రోజు శానిటేషన్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అసెంబ్లీలో రెగ్యులర్ గా ఉండే వైద్యులతో పాటు కరోనాపై అవగాహన ఉన్న వైద్యులను అందుబాటులో ఉంచుతాం. ఈసారి సమావేశాలకు ఒక్కో మీడియా సంస్థ నుండి అసెంబ్లీకి ఒకరు, కౌన్సిల్ కు ఒకరు చొప్పున మాత్రమే అనుమతిస్తాం. ఇతర మీడియా సిబ్బందికి అనుమతి లేదు. ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు తప్పనిసరిగా కరోనా టెస్ట్ లు చేయించుకుని నెగెటివ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి” అని చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu