తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ రెండు చోట్ల ఉపఎన్నిక కోసం మార్చి 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే కన్నుమూశారు. దీంతో ఆయా స్థానాలు ఖాళీ అవడంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఈ రోజు నుంచే ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది.
నాగార్జునసాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – మార్చి 23
- నామినేషన్లకు ఆఖరితేదీ – మార్చి 30
- నామినేషన్ల పరిశీలన – మార్చి 31
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఏప్రిల్ 3
- పోలింగ్ జరిగే తేదీ – ఏప్రిల్ 17
- ఓట్ల లెక్కింపు – మే 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ