కొత్త బార్లకు పెద్దసంఖ్యలో దరఖాస్తులు, గడువు పొడిగిస్తూ నిర్ణయం

New Bars in Telangana: Application Date Extended to February 16th

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 159 కొత్త బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 55, రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో 104 బార్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ముందుగా బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని ఫిబ్రవరి 8 గా నిర్ణయించారు. తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 వ తేదీ వరకు కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.

ఫిబ్రవరి 8, సోమవారం నాటికి 7360 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. సోమవారం ఒక్కరోజే ఐదువేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. దరఖాస్తు ఫీజు కింద రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసాక లాటరీ విధానం ద్వారా ఈ బార్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 18 న మునిసిపాలిటీల పరిధిలో, ఫిబ్రవరి 19 న జీహెచ్‌ఎంసీ పరిధిలో లాటరీ విధానం ద్వారా కొత్త బార్లకు లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ