నిరుద్యోగులకు శుభవార్త: గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Ekalavya Gurukulam Schools Teachers, Notification for Recruitment of Telangana Ekalavya Gurukulam, Recruitment of Telangana Ekalavya Gurukulam Schools Teachers, Telangana Ekalavya Gurukulam, Telangana Ekalavya Gurukulam Notification, Telangana Ekalavya Gurukulam Schools Teachers, Telangana Ekalavya Gurukulam Schools Teachers Recruitment

తెలంగాణ రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నారు. జూన్10వ తేదీ నుంచి ఈ నియామకాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించనున్నట్టు గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నియామకాల్లో భాగంగా తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ తో పాటుగా మ్యూజిక్, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాప్ట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. www.tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్ లో ఈ నోటిఫికేషన్ పూర్తీ వివరాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu