తెలంగాణ: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

PM Modi Announces ₹2 Lakh Ex-gratia For The Families of Road Accident Victims in Telangana, PM Modi Announces ₹2 Lakh Ex-gratia For The Families of Kamareddy Accident Victims, PM Modi Expresses Condolences For Kamareddy Accident Victims Announces Ex Gratia, PM Modi Announces Ex Gratia For Kamareddy Accident Victims, PM Modi Expresses Condolences For Kamareddy Accident Victims, Kamareddy Accident Victims, Ex Gratia For Kamareddy Accident Victims, Modi Expresses Condolences For Kamareddy Accident Victims, Kamareddy Accident News, Kamareddy Accident Latest News, Kamareddy Accident Latest Updates, Kamareddy Accident Live Updates, Narendra Modi, PM Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన ప్రమాదంలో మృతి చెందినవారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదే ప్రమాదంలో గాయపడిన వారికి ₹ 50,000 పరిహారం ప్రకటించారు. “తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి అందజేయబడుతుంది” అని ప్రధానమంత్రి కార్యాలయం (PMO), ఒక ట్వీట్‌లో పేర్కొంది.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా హసన్‌పల్లి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో లారీ, మినీ వ్యాన్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. మినీవ్యాన్‌లోని వ్యక్తులు యల్లారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి నిందితుడు లారీ డ్రైవర్‌ను గుర్తించామని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని కామారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారు.. అంజవ్వ (35 సంవత్సరాలు), వీరమణి (35 సంవత్సరాలు), లచ్చవ్వ (60 సంవత్సరాలు), సాయవ్వ (38 సంవత్సరాలు), సాయిలు (35 సంవత్సరాలు), ఎల్లయ్య (53 సంవత్సరాలు), పోశయ్య (60 సంవత్సరాలు), గంగవ్వ ( 45 ఏళ్లు), వీరవ్వ (70 ఏళ్లు).

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ