ఈటల రాజేందర్‌కు హుజురాబాద్‌లో ఓటమి భయం పట్టుకుంది – టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విమర్శలు

Telangana TRS MLAs Balka Suman Guvvala Balaraju and Vivekananda Responds Over BJP MLA Etela Rajender Politics, Telangana TRS MLA Vivekananda Responds Over BJP MLA Etela Rajender Politics, Telangana TRS MLA Balka Suman Responds Over BJP MLA Etela Rajender Politics, Telangana TRS MLA Guvvala Balaraju Responds Over BJP MLA Etela Rajender Politics, BJP MLA Etela Rajender Politics, Telangana TRS MLA Vivekananda, Telangana TRS MLA Balka Suman, Telangana TRS MLA Guvvala Balaraju, MLA Etela Rajender Politics, Etela Rajender Politics, BJP MLA Etela Rajender Politics News, BJP MLA Etela Rajender Politics Latest News, BJP MLA Etela Rajender Politics Latest Updates, BJP MLA Etela Rajender Politics Live Updates, Mango News, Mango News Telugu,

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు హుజురాబాద్‌లో ఓటమి భయం పట్టుకుందని, అందుకే నియోజకవర్గాన్ని మార్చాలని చూస్తున్నారని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాలరాజు, కేపీ వివేకానంద‌, బాల్క సుమ‌న్, మరికొందరు నేతలు టీఆర్ఎస్ ఎల్పీలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌ సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు ఆయన హుజురాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఈటలను ప్రశ్నించారు. రాబోయే ఎన్నిక‌ల్లో హుజురాబాద్‌లో రాజేంద‌ర్ ఓట‌మి ఖాయ‌మ‌ని, ప‌బ్లిసిటీ కోస‌మే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు.

ఈటల రాజేంద‌ర్‌ది వ్యాపార నైజం అని, ఆయ‌న‌కు ఒక సిద్ధాంతం అంటూ లేద‌ని ప్ర‌భుత్వ విప్ గువ్వ‌ల బాల‌రాజు విమర్శించారు. అనామకుడైన ఈటెలను సీఎం కేసీఆర్ మంత్రిని చేశార‌ని, అయినా పార్టీని కాదనుకుని వెళ్లారని గుర్తు చేశారు. ఈటల‌కు బీజేపీలో ఏం ప్ర‌త్యేక‌త ఉంద‌ని ఆయ‌న‌తో ఇత‌ర పార్టీల వారు ట‌చ్‌లో ఉంటార‌ని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఆయ‌న‌తో నిజంగా ట‌చ్‌లో ఉంటే ఉన్న‌వారి పేర్ల‌ను బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ‌లో ఎద‌గ‌దని, ఆ పార్టీకి ఇక్కడ సింగిల్ డిజిట్ కూడా దాట‌ద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరి తరం కాదని బాల‌రాజు తేల్చిచెప్పారు.

కాగా సోమవారం మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలోని చాలామంది నేతలు తనతో ట‌చ్‌లో ఉన్నారని, త్వరలోనే బీజేపీ లోకి చేరికలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా సోమవారం మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలోని చాలామంది నేతలు తనతో ట‌చ్‌లో ఉన్నారని, త్వరలోనే బీజేపీ లోకి చేరికలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని, సీఎం కేసీఆర్ ను ఓడిస్తానని కూడా వ్యాఖ్యానించారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ మండిపడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − one =