శీతాకాల విడిదికి డిసెంబర్ 26న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి

Mango News Telugu, Political Updates 2019, President Ramnath Kovind, President Ramnath Kovind Latest News, President Ramnath Kovind Will Come To Hyderabad, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ శీతాకాలపు విడిదిలో భాగంగా డిసెంబర్ 26, 2019న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన శీతాకాల విడిది చేయబోయే బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మల్కాజిగిరి ఆర్డీవో మధుసూదన్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అలాగే డిసెంబర్ 26న రాష్ట్రపతి కోవింద్ ముందుగా హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రయాణించే మార్గాన్ని సుందరీకరించే విషయంపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి విడిది సందర్భంగా అనుసరించాల్సిన విధానాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు పౌరసరఫరాల శాఖ అధికారికి వివరించారు. రాష్ట్రపతి విడిదిలో పాలుపంచుకునే అధికారులు పాసుల కోసం వారి యొక్క ఎంప్లాయ్ ఐడీ, ఆధార్ కార్డు మరియు ఫొటోలను నార్త్ జోన్ డీసీపీ, బేగంపేట ఏసీపీకి అందజేయాలని సమీక్ష సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + fourteen =