హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

Free Internet Service For Passengers, HMRL Latest News, Hyd Metro Rail, Mango News Telugu, Political Updates 2019, Sugar Box Network, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి ఇకపై సరికొత్త ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. మెట్రో రైళ్లలో అందుబాటులోకి వచ్చిన జీ5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను తాజాగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా మొబైల్‌ డేటా లేకుండానే నచ్చిన గేమ్‌లు, సినిమాలు, వీడియోలు వీక్షించే అవకాశం ప్రయాణికులకు కలుగుతుంది. ఈ మేరకు షుగర్‌బాక్స్ నెట్‌వర్క్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. హైదరాబాద్ మెట్రోలో షుగర్ బాక్స్ నెట్‌వర్క్‌ను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా షుగర్‌ బాక్స్‌ మెట్రో లోకల్‌ వై-ఫై సేవలను 10 మెట్రోస్టేషన్లలో ప్రారంభించినట్లు చెప్పారు. అతి త్వరలోనే మరిన్ని మెట్రో స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వినోదం, మేథోసంపత్తిని పెంచే పుస్తకాలును మెట్రో రైళ్లలో ఉంచాలని కోరామని చెప్పారు. ఈ యాప్‌ ద్వారా కేవలం మూడు నిమిషాల్లోనే సినిమా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు మెట్రో స్టేషన్లలో కల్పిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. షుగర్‌ బాక్స్‌ సీఈవో రోహిత్‌ మాట్లాడుతూ, ఈ సేవలను 60 రోజుల వరకు ఉచితంగా కొనసాగిస్తామని, ఆ తరువాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ప్రతి రోజు మెట్రోలో ప్రయాణం చేసే వారికీ ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =