కృష్ణా జిల్లాలో జూన్ 17, బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని ముందుగా సమీపంలోని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామానికి చెందిన 30 మంది ట్రాక్టర్ లో దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ డీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా మధిర ప్రాంత వాసులు దుర్మరణం చెందడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu