ఏపీ శాసనసభ నిరవధికంగా వాయిదా

Andhra Pradesh, Andhra Pradesh Assembly, AP Assembly, AP Assembly Budget Session 2020, AP Assembly Budget Sessions, AP Assembly session, AP Budget Session, AP Budget Session 2020, AP Legislative Assembly, AP Legislative Assembly Adjourned, AP Legislative Assembly Adjourned Indefinitely, AP News

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జూన్ 16 న ప్రారంభంమైన సంగతి తెలిసిందే. కాగా రెండోరోజు సమావేశాల అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారం ప్రకటించారు. ఈ రోజు సమావేశాల్లో భాగంగా ఏపీ వార్షిక బడ్జెట్‌-2020-21 కు, ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌)ను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.

ఎన్‌పీఆర్ కు సంబంధించి 2010 నాటి ఫార్మట్‌ ప్రకారమే అమలు చేయాలని, ఎన్‌పీఆర్‌–2020లో మార్పులు చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా స్పష్టం చేశారు. మరోవైపు భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభలో సభ్యులంతా రెండు నిముషాలపాటు మౌనం పాటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 17 =