రాష్ట్రంలో రేపటి నుంచి (డిసెంబర్ 28) రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం నిధులు జమఅవుతాయని, అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ చేయడం జరిగిందని, ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ చేయడము అవుతుందని మంత్రి తెలిపారు. ఇక డిసెంబరు 10వ తేదీ నాటికి ధరణి పోర్టల్ నందు పట్టాదారులు మరియు కమీషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారులు అర్హులని చెప్పారు.
ఈ యాసంగి సీజన్ లో 66.61 లక్షల మంది రైతులుకు గాను 152.91 లక్షల ఎకరాలకు రూ.7645.66 కోట్లు జమచేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైందని అన్నారు. దీనిలో 3.05 లక్షల ఎకరాలకు గాను 94 వేల మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులని చెప్పారు. ముందుగా ఎకరా నుండి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణా క్రమంలో రైతుబంధు నిధులు జమ జరుగుతుందన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాలలో ఒకటిగా రోమ్ లో 2018 నవంబరులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్ఎఓ గుర్తించిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ