ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, ప్రభుత్వ విప్, పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, సత్తుపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ లతో పాటుగా పలువురు నేతలు ఉన్నారు. ముందుగా ఆలయం వద్దకు వచ్చిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో స్వామివారికి అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు వేద పండితులు
వేదాశీర్వచనం అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY