పుండు మీద కాకి పొడిచినట్లు ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి. ఓవైపు రాష్ట్రంలో అధికారం కోల్పోయి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాక ఆ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. భవిష్యత్ ఏంటో అర్థం కాక అయోమయంలో పడిపోయింది. ఇదే సమయంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరుస పెట్టి పార్టీ ఫిరాయించడం బీఆర్ఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్కొక్కరుగా వరుస పెట్టి బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీ మారుతున్నారు. రెండు రోజులకు ఒక నేత అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ గూటికి చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రాు, పోచారం శ్రీనివాస రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలతో పాటు రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. హస్తం పార్టీ కండువా కప్పుకున్నాక కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్‌కు అర్థరాత్రి ఊహించని షాక్ తగిలింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఆరుగరు ఎమ్మెల్సీలు గంప గుత్తగా పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వారాజు సారయ్య, దండె విఠల, భాను ప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, యెగె మల్లేశంలు అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా.. ఊహాగాణాలకు అవకాశమే లేకుండా వారంతా కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. ఏ మాత్రం లీకులు లేకుండా ఆరుగురు ఎమ్మెల్సీలు అర్థరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సంచలనంగా మారింది.
గురువారం అర్థరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని ఓ హాటల్‌లో సమావేశం అయ్యారు. పార్టీ ఫిరాయింపుపై చర్చలు జరిపారు. చివరికి అంతా కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి జూబ్లీ హిల్స్‌లోని తన నివాసం చేరుకున్నాక.. ఎమ్మెల్సీలంతా వెళ్లి ఆయన్ను కలిశారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ గూటికి చేరారు. ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. వారు కాంగ్రెస్‌లో చేరిన సమయంలో వారి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత సురేందర్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. అయితే ఊహించని విధంగా రాత్రికి రాత్రి ఆరుగురు ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇదే సమయంలో వరుస పెట్టి బీఆర్ఎస్ నేతలు పార్టీ ఫిరాయిస్తుండడంతో పార్టీ మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ కాంగ్రెస్ గూటికి చేరారు. త్వరలోనే మరో 10 నుంచి 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్‌లో అత్యంత కీలకమైన, పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే కొనసాగుతున్న నేతలు కూడా త్వరలోనే పార్టీ ఫిరాయించనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు గులాబీ బాస్ తన ఫామ్ హౌస్‌లో తమ పార్టీ నేతలతో వరుసగా సమావేశం అవుతున్నప్పటికీ.. పార్టీ ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు. మర ఫిరాయింపులకు కేసీఆర్ అడ్డుకట్ట వేస్తారా?.. తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవ్వకుండా అడ్డుకుంటారా? అన్నది చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE