వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

Sound And Light Show At Golconda, Sound And Light Show, Golconda Sound And Light Show, Light Show, Golconda Special Programs, Golconda, Kishan Reddy, Chiranjeevi And Mp Vijayendra Prasad, Latest Golconda Sound And Light Show News, Light Show Golconda News, Golconda Fort, Hyderbad, Telangana, Mango News, Mango News Telugu
Sound and Light Show at Golconda, Golconda Special programs, Golconda, Kishan Reddy ,Chiranjeevi and MP Vijayendra Prasad

హైదరాబాదీలకు నేటి నుంచి మరో ఎంటర్‌టైన్‌మెంట్ రాబోతోంది. గోల్కొండ కోటలో కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు మన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా.. సౌండ్ అండ్ లైట్ షోను  బుధవారం అంటే జనవరి 24 నుంచి  వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో 11వ శతాబ్దపు చారిత్రక గోల్కొండ కోట చరిత్రను ఇప్పటి వారికి  తెలియజేసేలా కొన్ని ప్రదర్శలను నిర్వహించనున్నారు.

దీంతోపాటు గోల్కొండ కోట రాత్రిళ్లు కూడా దేదీప్యమానంగా కనిపించేలా ‘ఇల్యుమినేట్’ చేయనుంది. 11వ శతాబ్దానికి చెందిన  గోల్కొండ కోట డెక్కన్ ప్రాంతంలోని ప్రముఖమైన కోటల్లో ఒకటి అని అందరికీ తెలిసిందే. దీన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా  సంరక్షిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ఎవరు వచ్చినా గోల్కొండ కోటను చూడటం అస్సల మిస్ అవ్వరన్న నేమును సంపాదించుకుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంతో ఈ వారం రోజుల్లో రోజుకు  2వేల నుంచి 3వేల మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోల్కొండ కోటలో ప్రస్తుతం ఉన్న సౌండ్ అండ్ లైట్ షో 1993వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రీ-రికార్డెడ్ సౌండ్ ట్రాక్స్, ఫిక్స్‌డ్ లైట్స్‌పై ఈషోను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా.. అంతర్జాతీయ స్థాయిలో.. గోల్కొండ చరిత్రను మరింత గొప్పగా  అందరికీ చూపించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం త్రీడీ మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై-రెజల్యూషణ్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ వంటి  లేటెస్ట్ టెక్నాలజీ కలబోతతో వినూత్నంగా రూపొందించిన ఈ షో సందర్శకులను ఆకట్టుకుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.

గోల్కొండలో జరిగే ఈ ఈవెంట్ కవరేజ్ కోసం ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ మద్దతుగా నిలిచింది. ఈ సౌండ్ అండ్ లైట్  కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించగా.. గౌరవ అతిథులుగా మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ హాజరుకాబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =