రుణమాఫీ అవలేదా? డోంట్ వర్రీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. దీనిలో భాగంగానే అప్పుడు ఇచ్చిన రుణమాఫీ హామీ మేరకు రూ.2 లక్షల వరకు రునమాఫీని అమలు చేస్తోంది. రెండువిడుతలుగా నిధులు రిలీజ్ చేయడంతో..ఇప్పటికే చాలా మంది రైతులు రుణమాఫీ లబ్ది పొందారు.

అయితే.. కొన్ని చోట్ల మాత్రం వేరు వేరు కారణాల వల్ల కొంతమందికి ఇప్పటికీ రుణమాఫీ జరగలేదు. అలాంటి రైతులంతా తమకు రుణమాఫీ జరగలేదంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాంటి రైతులకు తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఈ రుణమాఫీ పథకానికి అర్హులై ఉండి, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారందరి కోసం.. నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆ రైతుల రుణాలను మాఫీ చేస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే రుణమాఫీ కోసం అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతుభరోసా వంటి కార్యక్రమాలలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలను పొన్నం ఖండించారు. హరీశ్ రావు ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపించి తెలంగాణలలో 3 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదని ఆయన ఆరోపించారు.

అంతేకాదు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. పంటల బీమా లేకపోడంతో పాటు పరిహారం అందకపోవడం వంటి కారణాలలో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఇప్పుడు పెట్టిన కాల్ సెంటర్లు అప్పుడు పెడితే రైతులకు మేలు జరిగి ఉండేది కదా అని సూచించారు. అప్పుడు కాల్ సెంటర్లకు బదులు కలెక్షన్ సెంటర్లు పెట్టారని ఎద్దేవా చేశారు.