మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Mango News, MP Revanth Reddy, MP Revanth Reddy Tested Covid Positive, MP Revanth Reddy Tested Positive, MP Revanth Reddy Tested Positive for Covid-19, Revanth Reddy Tested Positive for Covid-19, T-Congress Working President, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నాతో సంప్రదించిన వారంతా దయచేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి” అని ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు మార్చి 22, సోమవారం రాత్రి 8 గంటలవరకు తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,867 కి చేరింది. ఇప్పటివరకు 2,99,042 మంది కరోనా నుంచి కోలుగా, ప్రస్తుతం 3151 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ