ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ బుధవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హీరో విజయ్ ను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్, హీరో విజయ్ మధ్య కొద్దిసేపు పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. సీఎంను కలిసినవారిలో విజయ్ తో పాటుగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. వీరు ముందుగా టీఆర్ఎస్ నేత, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ను కలుసుకున్నారు. అనంతరం ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిశారు.
డైరెక్టర్ వంశీతో కలిసి హీరో విజయ్ ని కలిసినందుకు సంతోషంగా ఉందని, ఇటీవల ఒక మొక్కను నాటడం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సహకరించినందుకు హీరో విజయ్ కు ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరో విజయ్ 66వ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ క్రమంలోనే వారు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF