టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, దసరాకు 4045 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు

Mango News, TSRTC, TSRTC Latest News, TSRTC Making Arrangements to Run 4045 Special Buses during Dussehra Festival Time, TSRTC Special Buses, TSRTC Special Buses during Dussehra, TSRTC Special Buses During Dussehra Festival, TSRTC Special Buses during Dussehra Festival Time, TSRTC Special Buses For Dasara, TSRTC to operate special buses for Dasara

తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్దమయింది. హైదరాబాద్ నగరం నుండి అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. దసరాకు మొత్తం 4,045 ప్రత్యేక బస్సులు నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం వెల్లడించారు. వీటిల్లో 3,085 బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, అలాగే 950 బస్సులు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణికుల రద్దీ డిమాండ్ కు అనుగుణంగా నడపనున్నట్టు తెలిపారు. ఈ బస్సుల్లో అడ్వాన్స్‌డ్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్ స్టేషన్ తో పాటుగా బీహెచ్ఈఎల్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, టెలీఫోన్ భవన్, ఈసీఐఎల్, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ వంటి అనేక ప్రధాన బస్ స్టాఫ్ ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =