దేశంలో మళ్ళీ పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు.. ఈసారి ఎంత పెరిగాయంటే?

India LPG Cylinder Prices Hikes Again Domestic Rs 3.50 and Commercial Rs 8, LPG Cylinder Prices Hikes Again Domestic Rs 3.50 and Commercial Rs 8, India LPG Cylinder Prices Hikes Again, LPG Cylinder Prices Hikes Again, Domestic LPG cylinder costlier by Rs 3.50, Commercial cylinder hiked by Rs 8, LPG Price Hike, Commercial cylinder hiked Again, Rs 8 per cylinder hike For a 19-kg commercial cylinder, commercial cylinder, India LPG Cylinder Prices, Domestic LPG cylinder, prices of domestic LPG cylinder have been hiked, LPG Cylinder Price Hike News, LPG Cylinder Price Hike Latest News, LPG Cylinder Price Hike Latest Updates, LPG Cylinder Price Hike Live Updates, Mango News, Mango News Telugu,

గురువారం వంట గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం రెండవసారి కావడం విశేషం. ఈరోజు నుంచి అమలులోకి వచ్చిన ధరల ప్రకారం.. 14.2 కిలోల గృహ అవసరాల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 3.50 పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రూ. 1,000 మార్కును అధిగమించాయి. నేటి నుండి, 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్లు ఢిల్లీ మరియు ముంబైలలో రూ. 1,003కి చేరుకుంది. కోల్‌కతాలో రూ. 1,029గా ఉండగా చెన్నైలో దీని ధర రూ. 1,018.5 గా ఉంది. దీనికి ముందు మే 7న కూడా గ్యాస్ ధరలు ₹50 పెంచబడ్డాయి.

దీని కారణంగా దేశ రాజధానిని మినహాయించి అనేక నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 1,000 మార్క్‌ను దాటింది. అయితే, నేటి పెంపు తర్వాత ఢిల్లీ కూడా రూ. 1,000 మార్కును దాటింది. ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే 2014 తర్వాత అత్యధికంగా 7.8 శాతానికి పెరిగిన సమయంలో ఎల్‌పీజీ సిలిండర్‌ల ధరలలో పెరుగుదల కనిపించింది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధర రూ. 8 పెరిగింది. ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ఇప్పుడు రూ. 2,354గా ఉంది. మే 1న హోటళ్లు మరియు రెస్టారెంట్లు వంటి వాటిలో ఉపయోగించే 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 102.50 పెరిగి రూ. 2,355.50కి చేరింది. తాజాగా మరోసారి రూ. 8 పెరిగింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 9 =